Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వ్ : సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పెగాసస్ కుంభకోణం'పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించ నున్నది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ మిలటరీ గ్రేడ్ నిఘా స్పైవేర్‌ను మోడీ సర్కార్ కొనుగోలు చేసిందని, మనదేశంలో ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు.. తదితరులై నిఘా కార్యకలాపా లకు పాల్పడిందన్నది మోడీ సర్కార్‌పై ఆరోపణలు వెలువ డ్డాయి. దీనిపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ జరపాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 13న తీర్పును రిజర్వ్‌లో ఉంచుంది. ఈ వ్యవహారంలో ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటుచేసింది. మోడీ సర్కార్ అక్రమ నిఘా కార్యకలాపాలకు పాల్పడిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆగస్టు 15న సుప్రీంలో కేంద్రం అఫిడవట్ దాఖలుచేసింది. స్పైవేర్ కొనుగోలు చేసిందా? లేదా? వాడారా? లేదా? అన్నది సూటిగా ఈ అఫిడవిట్లో కేంద్రం తెలుపలేదు. పిటిషనర్లు అడిగిన ప్రశ్నలు దేశ భద్రత, రక్షణతో ముడిపడినవి కాబట్టి వీటిని బయటపెట్టమని పేర్కొన్నది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది..''దేశ రక్షణ, ప్రయోజనాలు, భద్రతతో ముడిపడిన అంశాల్ని అడగటం లేదు. ఆ వివరాలు ఇక్కడ అప్రస్తుతం. ఆ వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. జర్నలిస్టులు, మేథావులు, న్యాయవాదులు..ఇలా కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా స్పైవేర్‌తో అక్రమ నిఘాకు కేంద్రం పాల్పడిందా? లేదా? అన్నదే తెలుసుకోవాలనుకుంటున్నాం. చట్టపరిధిలో కాకుండా ఇతర పద్ధతుల్లో చేశారా? లేదా? అన్నది మాత్రం చెప్పండి'' అని ప్రశ్నించింది. ఈనేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.