Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏ.పీ.జే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీనిని ప్రయోగించింది. ఇది 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని-5 క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లు రూపొందించాయి. దీని బరువు దాదాపు 50 వేల కేజీలు. పొడవు 1.75 మీటర్లు. ఇది ఒకటిన్నర టన్నుల అణువార్ హెడ్లను మోయగలదు. దీని వేగం ధ్వని వేగం కంటే 24 రెట్లు ఎక్కువ.