Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే వారం రూ.100 వరకు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ: ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలతో భారాన్ని ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు మరొకసారి జేబులకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వచ్చే వారం వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి. దేశీయంగా సిలిండర్‌పై రూ.100 పెరగనున్నట్టు తెలుస్తున్నది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ధరలు మరోసారి పెంచేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా ఇందుకు ప్రభుత్వ అనుమతి కోసం సదరు సంస్థలు వేచి చూస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగనున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే, దేశీయంగా అన్ని రకాల వంట గ్యాస్ సిలిండర్లపై ఈ ఏడాది ధరల పెరుగుదల ఐదో సారి అవుతుంది. ఎల్పీజీ ధరలు చివరగా ఈనెల 6న రూ. 15గా పెరిగాయి. దీంతో ఈ ఏడాది జులై నుంచి 14.2 కిలలో సిలిండర్‌పై రూ 90 మేర ధరలు పెరగడం గమనార్హం. గతేడాది నుంచే ఎల్పీజీపై కేంద్రం రాయితీలు తొలగించింది. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేకుంటే వినియోగదారులపై మోపేందుకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నాయి.
మళ్లీ పెట్రో బాదుడు
రెండు రోజుల విరామం అనంతరం దేశంలో చమురు ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 35 పైసల చొప్పున ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.27 కు, డీజీల్ ధర రూ.105.46 కు ఎగబాకింది.