Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీకట్లో వెలుగు రేఖల్ని నింపింది : ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే
న్యూఢిల్లీ: పెగాసస్ కుంభకోణంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని, పాలకులు నేరం చేశారనేది ఇక్కడ ప్రాథమికంగా బయటపడిందని ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు. ప్రముఖ న్యూస్ వెబ్‌పోర్టల్ 'దవైర్'తో మాట్లా డుతూ..''పెగాసస్‌పై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు అత్యంత కీలక మైనది. వాస్తవానికి ఈ తీర్పు ప్రజాస్వామ్య హక్కులపై అలుముకున్న చీకటిని చీల్చే వెలుగురేఖలు. త్రిసభ్య కమిటీతో దర్యాప్తునకు ఆదేశించటం, దీనిని తామే పర్యవేక్షిస్తామని సుప్రీం నిర్ణయించటం దేశం యావత్తు ఆశ్చర్యానికి లోనుచేసింది. దేశ భద్రత, గోప్యతా హక్కుపై సుప్రీం స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో దేశ పౌరుల వైపు నిలబడతామని చెప్పింది. దేశ భద్రత పేరుమీద కేంద్రం చెప్పిన మాటల్ని తోసిపుచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కులకు కాపలా కుక్కల్లా ఉంటామని చెప్పింది'' అని అన్నారు.