Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్ వ్యక్తిపై రాజద్రోహం కేసు
బుదౌన్: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకున్నందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యక్తిపై రాజద్రోహం కేసు నమోదయింది. హిందూ జాగరణ్ మంచ్‌కు చెందిన పునీత్ శాక్యా ఫిర్యాదు మేరకు బుదౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఫైజ్‌గంజ్ బెహ్త ప్రాంతానికి చెందిన నైజ్ పాక్ విజయం అనంతరం తన ఫేస్బుక్ ఖాతాలో పాకిస్తాన్ జెండాను పోస్ట్ చేశాడు. 'ఐ లవ్ యూ పాకిస్తాన్, ఐ మిస్ యూ పాకిస్తాన్, జీత్ ముబారక్ పాకిస్తాన్' అనే వ్యాఖ్యలు రాసాడు. పునీత్ శాక్యా ఫిర్యాదు మేరకు రాజద్రోహం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బుదౌన్ ఎస్ఎస్పీ ఒ.పి. సింగ్ చెప్పారు. ఈ నెల 26న నైజ్పై కేసు నమోదు చేసి, జైలుకు పంపినట్టు తెలిపారు. కాగా, టీ20 కప్‌లో పాకిస్తాన్ విజయంపై సంబరాలు చేసుకున్న వారి దేశ ద్రోహ చట్టం ప్రయోగిస్తామని గురువారం యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ హెచ్చరించారు. 'పాకిస్తాన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నవారు రాజద్రోహాన్ని ఎదుర్కొవాలి' అని యోగి అదిత్యనాథ్ అధికారిక కార్యాలయం తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఇలాంటి కేసులు ఆగ్రా, బరైల్లీ, బుదౌన్, సితాపూర్ల్లో ఏడుగురిపై ఐదు కేసులు నమోదయ్యాయి.