Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యుత్తు ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏపీకి చెందిన పలువురు ఎస్సీఎస్టీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫారసులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ ఏపీకి చెందిన పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు సుప్రీం కోర్టు రిజర్వు చేసిన విషయం విదితమే. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ సిఫారసులకు విరుద్ధంగా 17 మంది ఎస్సీ,ఎస్టీ ఉద్యోగలును తెలంగాణకు బదిలీ చేశారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. వీరిలో ముగ్గురుని వెనక్కి తీసుకోవడానికి ఏపీ డిస్కంలు అనుమతించాయని వివరించారు. వాదనల అనంతరం ఇదే అంశంపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వు అయిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం తీర్పు వచ్చిన అనంతరం ఈ పిటిషన్ విచారిస్తాంటూ వాయిదా వేసింది.