Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు రూ.1,264 కోట్లు
- ఏపీకి రూ.905 కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంలో లోటును తీర్చేందుకు బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయం మిగులు కింద కేంద్ర ఆర్థిక శాఖ గురువారం రూ.44 వేల కోట్లు విడుదల చేసింది. అందులో తెలంగాణకు రూ.1264.78 కోట్లు ,ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు విడుదల చేసింది. కాగా గతంలో జులై 15న రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.75 వేల కోట్లు, అక్టోబర్ 7న విడుదల చేసిన రూ.40 వేల కోట్ల మొత్తంతో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పరిహారానికి బదులుగా బ్యాక్ టు బ్యాక్ లోన్‌గా విడుదల చేసిన మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ విడుదల సాధారణ సెస్ సేకరణ నుంచి ప్రతి రెండు నెలలకు విడుదలయ్యే సాధారణ జీఎస్టీ పరిహారానికి అదనమని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.