Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి: ఉప ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనపై అసోం సీఎం హిమంత విశ్వ శర్మను ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రచారాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు దూరంగా ఉండాలని సూచించింది. ఎన్నికల ప్రచార సభల్లో అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం హామీ లు ఇస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఈసీకి కాంగ్రెస్ నాయకులు దేవవ్రత సైకియా, భూపెన్ కుమార్ బోరాV్‌ా లు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ప్రచారం చేయకుండా ఆయపై నిషేదం విధించాలనీ వారు కోరారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భవానీపూర్, తౌరా, మరియనీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ప్రకటనలు చేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 24 గంటల్లో స్పందన తెలియజేయాలంటూ ఈనెల 25న ఆయనకు షోకాజ్ నోటీసును పంపింది. ఈ మేరకు స్పందించిన సీఎం 'బేషరతు క్షమాపణలు' తెలిపారు. చట్టానికి, ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సీఎం వ్యవహరించాడని సీఎం క్షమాపణల అనంతరం ఎన్నికల సంఘం తెలిపింది.