Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడుగా ఎఎ రహీమ్ ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన డివైఎఫ్ఐ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం ముగిసింది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బేపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రివర్గంలో కేరళ టూరిజం,పబ్లిక్ వర్క్స్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిసు ్తన్నారు. దీంతో ఆయన సంఘం జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను కేరళ డీవైఎఫ్ఐ కార్యదర్శి ఎఎ రహీమ్‌కు అప్పగిస్తూ ఈ మేరకు కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. అలాగే ఎస్ఎఫ్ఐ కేరళ మాజీ రాష్ట్ర కార్యదర్శి జెక్ పి.థామస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నిరుద్యోగంపై దేశవ్యాప్త ఆందోళలు, నవంబర్ 15న దేశవ్యాప్తంగా త్రిపుర సంఘీభావ దినోత్సవాన్ని, డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేతను నిరసిస్తూ మతోన్మాద వ్యతిరేక ఆందోళలు నిర్వహించాలని డీవైఎఫ్ఐ కేంద్ర కమిటీ నిర్ణయం నిర్ణయించింది.
రహీమ్ ప్రస్థానం
డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎఎ రహీమ్, ప్రస్తుతం డీవైఎఫ్ఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన డీవైఎఫ్ఐ తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కేరళ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వర్కాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీ, లా అకాడమీలో లా విద్యనభ్యసించారు. రహీమ్ హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ, న్యాయ, జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. ఆయన భార్య అమృత ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు.