Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 254 శాతానికి పైనే పన్నులు..
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యం పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు గురువారం సైతం మళ్లీ పెరిగి.. వినియోగదారులపై మరింత భారం మోపాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై చమురు కంపెనీలు 35పైసల చొప్పున పెంచాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో లీటరు పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో రూ.120కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తాజా పెంపుతో లీటరు పెట్రోల్ ధర రూ.114.14, లీటరు డీజిల్ ధరలు రూ.105.12గా ఉంది. దేశరాజధాని ఢల్లీీలోనూ చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.108.29, డీజిల్ ధర రూ.97.02కు పెరిగింది.దేశంలోని ప్రధాన నగరాలైన కోల్కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.108.78, రూ.100.14కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.105.13, డీజిల్ ధర రూ.101.25కు చేరింది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.112.06, డీజిల్ రూ.102.98కు పెరిగింది. తెగులు రాష్ట్రాల్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ.112 దాటగా, గుంటూరులో లీటరు పెట్రోల్ రూ.114కు పెరిగింది. ఒక్క అక్టోబర్ నెలలోనే ఇప్పటివరకు 20 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
పన్ను బాదుడు మాములుగా లేదు !
చమురు ధరలు పెరుగుదల ప్రభావం ఇతర నిత్యావసరాల ధరలపైనా పడుతుండటంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం లబోదిబో మంటున్నారు. చమురు ధరలు, వాటిపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 2014లో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 109 డాలర్లు కాగా, లీటరు పెట్రోల్ ధర మన దేశంలో రూ.72, లీటరు డీజిల్ ధరలు రూ.57గా ఉంది. ప్రస్తుతం బ్యారెల్ ధర 85 డాలర్లకు తగ్గిపోయింది. అయితే, ఈ మేరకు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల్సిందిపోయి.. రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చమురు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే. దాదాపు 254 శాతం పన్నులు విధిస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయి. గత రెండేండ్లలో దేశీయంగా పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ ధరలు 46 శాతం పెరిగాయి.