Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బాజ్ మర్చంట్, ముమున్ ధమేచాలకు కూడా
ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, ముమున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఏకసభ్య ధర్మాసనం జస్టిస్ ఎన్.డబ్ల్యు.సాంబ్రె ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రానికి పూర్తి వివరాలతో ఆదేశాలు అందచేస్తామని తెలిపారు. ఆర్యన్‌ఖాన్ తరపు న్యాయవాదులు నగదు బెయిల్ అందచేయడానికి అనుమతి కోరగా, కోర్టు తిరస్కరించింది. పూచీకత్తు ఇవ్వాల్సి వుంటుందని పేర్కొంది. మంగళవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఆరంభమయ్యాయి. బుధవారం నాటికి ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది ముకుల్ రోV్ాత్గి, సహ నిందితుడు అర్బాజ్ మర్చంట్ తరపు లాయర్ అమిత్ దేశారు, ముమున్ ధమేచా తరపు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్‌లు తమ వాదనలు పూర్తి చేశారు. అప్పటికే రెండు గంటలకు పైగా వాదనలు విన్న జస్టిస్ సాంబ్రె గురువారం ఎన్‌సిబి (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) వాదనలు వింటానని చెప్పారు. మాదకద్రవ్యాలున్నాయన్న ఆరోపణలపై ముంబయి తీరంలో క్రూయిజ్నౌకపై ఎన్‌సిబి జరిపిన దాడిలో అక్టోబరు 3వ తేదీన ఆర్యన్ ఖాన్, మర్చంట్, ధమేచాలు అరెస్టయ్యారు. ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో గత వారం హైకోర్టును ఆశ్రయించారు.