Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిక్రీలో జరిగిన ఘటనలో ముగ్గురు మృతి
- ఇద్దరికి తీవ్ర గాయాలు
- సమగ్ర దర్యాప్తునకు ఎస్కేఎం డిమాండ్
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటన మరువకముందే... మరో దారుణం చోటుచేసుకుంది. ఆందోళనా కార్యక్రమాన్ని ముగించుకుని ఇండ్లకు తిరిగి వెళుతున్న మహిళా రైతులే లక్ష్యంగా... ట్రక్కే సాధనంగా మారింది. రోడ్డు పక్కన కూర్చున్న రైతులపైకి ట్రక్కు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన వివరాల్లోకి వెళితే... ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళన చేస్తున్న టిక్రీ సమీపంలో రైతులపై టిప్పర్ ట్రక్కు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళ రైతులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు మహిళ రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రోV్‌ాతక్‌లోని పీజీఐఎం ఎస్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మాన్సా జిల్లా ఖివా దియాలువాలాకు చెందిన అమర్జీత్ కౌర్, గుర్మెల్ కౌర్, సుఖ్వీందర్ కౌర్ ప్రాణాలు కోల్పోయారు. గుర్మెల్ కౌర్, హర్మీత్ కౌర్ తీవ్రంగా గాయపడ్డారు. రైతు ఉద్యమంలో మహిళ రైతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తీవ్ర విచారం వ్యక్తంచేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామని ఎస్కేఎం పేర్కొంది. ఈ ఘటనపై నిష్పాక్షికమైన, సమగ్ర దర్యాప్తు జరపాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ట్రక్కు డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి పారిపో యాడని పోలీసులు తెలిపారు. 'ఈ ఘటనతో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వారి ఆత్మకు శాంతికలగాలనీ, నిందితులను కనుగొని వెంటనే అరె స్టు చేయాలని హర్యానాపోలీసులను కోరుతున్నాను' అని పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రైతుల సెగ
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రైతుల నిరసన సెగ తాకింది. రైతుల ఆందోళనతో పంజాబ్‌లోని ఘరువాన్లోని ఒక ప్రయివేటు విశ్వవిద్యాలయంలో ఆయన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో విశ్వవిద్యాలయం తన కార్యక్రమాన్ని రద్దు చేసింది. రైతుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిరసన తెలిపిన రైతులకు యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయ కపోతే నవంబర్ 11న లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పాలియా నుంచి నిఘాసన్ వరకు ''ఖేత్ ఖేతీ కిసాన్ బచావో యాత్ర'' నిర్వహిస్తామని ఎస్‌కెఎం పేర్కొంది. నవంబర్‌లో 13న నిఘాసన్లో భారీ ర్యాలీ నిర్వహిం చనున్నట్టు తెలిపింది. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో మరిముఖ్యంగా పూర్వాంచల్ అంతటా రైతు నాయకులపై పోలీసుల అణచివేతను యోగి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రలు, నిరహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
పూణే నుంచి ప్రారంభమైన షహీద్ కలశ యాత్ర
లఖింపూర్ ఖేరీ షహీద్ కలశ యాత్ర గురువారం మహారాష్ట్రలోని పూణేలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చారిత్రాత్మక నివాసం నుంచి ప్రారంభమైంది. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(కేఎస్ఎస్కేఎస్), పోరాట కమిటీ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (జేఏఎస్ఎస్) సంఘాలు సంయుక్తగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలు రైతు లు, కార్మికులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ఎన్ఏపీఎం నాయకురాలు మేధా పాట్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం పూణే ఏపీఎంసీ మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో అశోక్ ధావలే, మేధా పాట్కర్, ప్రతిభా షిండే, నామ్‌దేవ్ గవాడే, అజిత్ నవాలే, విద్యా చవాన్, సుభాష్ వారే, విశ్వాస్ ఉతగి, సుభాష్ కాకుస్తే, ఉల్కా మహాజన్, కిశోర్ ధామలే ప్రసంగించారు. నవంబర్ 27న శనివారం షాహీద్ కలశ యాత్ర ముంబాయి చేరుకుంటుందని తెలిపారు. చారిత్రాత్మ రైతు ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో నవంబర్ 28 ఆదివారం ముంబాయిలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర వ్యాప్త కిసాన్-మజ్దూర్ మహాపంచాయత్‌ను నిర్వహించనున్నారు.
రైతులకు విపత్తు పరిహారం ఇవ్వాలి
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు విపత్తు పరిహారం ఇవ్వాలనీ, పలుప్రాంతాల్లో వరి సేకరణను సక్ర మంగా ప్రారంభించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. గులాబీరంగు పురుగు కారణంగా పత్తి పంటకు నష్టం వాటిల్లిందనీ, ఈకేసులన్నింటి లో రైతుల న్యాయమైన డిమాండ్లను సంబంధిత ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరిం చాలని ఎస్కేఎం పేర్కొంది. ఎరువల సరఫరాలను తగినంతగా సకా లంలో సజావుగా చేయాలనీ, ధరల నియంత్రణలో ఉండేలా చేయాలని డిమాండ్ చేసింది.