Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెండోరా
ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతం లో మహారాష్ట్రలో గోదా వరిపై నిర్మించిన బాబ్లీప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా ప్రతేడాది వర్షాకాలం ప్రారంభంలో జులై 1వ తేదీన తెరిచిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను అక్టోబర్ 28న మూసివేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా శుక్రవారం కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లు మూసివేసినట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈఈ చక్రపాణి,డీఈఈ గణేష్, ఏఈఈ వంశీ తెలిపారు. తాగునీటి అవసరాల కోసం మళ్లీ మార్చి 1వ తేదీన 0.6 టీఎంసీల నీటిని దిగువకు విడదల చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులతో పాటు సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్‌రావు, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఈఈ ఎన్ పి.గవానే, డీఈఈ జీఎం బావే పాల్గొన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 7800 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు(90.313 టీఎంసీలు) కాగా అదే స్థాయిలో నీరు నిల్వ ఉంది.