Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
న్యూఢిల్లీ : దేశీయంగా వచ్చే 12 నెలల్లో బంగారం ధరలు రూ.52000-53000 గరిష్ట స్థాయికి పెరుగొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఆ వివరాలు.. 2019, 2020లో చూస్తే బంగారం ధరలు వరుసగా 52 శాతం, 25 శాతం చొప్పున పెరిగాయి. 2021లో ఇప్పటి వరకు తక్కువ పెరుగుదల ఉంది. ఈ ఏడాది.47,000 - 49,000 మధ్య ఎక్కువ కదలాడింది. ఇటీవలి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా సెప్టెంబర్ 21తో ముగిసిన త్రైమాసికంలో బంగారం డిమాండ్ 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరుకుంది. దీపావళి 2020లా కాకుండా, ఈ సంవత్సరం చాలా తక్కువ కరోనా పరిమితులు ఉన్నాయి. దుకాణాలు తెరిచి ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం డిమాండ్ కూడా పెరిగింది. రాబోయే ఏడాది కాలంలో బంగారం ధరల్లో రూ.2వేల మేర పెరుగొచ్చని అంచనా.