Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి నవీన్ పట్నాయక్ డిమాండ్
భువనేశ్వర్ : రాష్ట్రం నుంచి వసూలు చేస్తోన్న క్లీన్ ఎనర్జీ సెస్‌లో కనీసం 60 శాతం వాటాను తమకు ఇవ్వాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో తన నివాసంలో భేటీ అయిన సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 2020-21లో ఒడిశా 152.85 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 25 శాతం ఇక్కడి నుండే ఉత్పత్తి అవుతుంది.