Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల కరోనా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు వందలకులోపు కరోనా మరణాలు సంభవిస్తుండగా, వారం నుంచి నిత్యం 500లకు పైగా కరోనా మరణాలు చోటుచేసుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,313 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 549 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలోని మొత్తం కరోనా కేసులు 3,42,60,470కి పెరిగాయి. మరణాలు 4,57,740కి చేరాయి. ప్రస్తుతం 1,61,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడ్డవారిలో 3,36,41,175 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.19 శాతానికి, మరణాల రేటు 1.34 శాతానికి చేరింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్‌లు టాప్‌లో ఉన్నాయి.
రష్యాలో నిత్యం వేయికి పైగా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. పలు దేశాల్లో కరోనా మళ్లీ పంజా విసురుతుండటంతో ఆంక్షల దిశగా ముందుకు సాగుతున్నాయి. అన్ని దేశాల్లో కలిపి నిత్యం 5 లక్షలకు పైగా కరోనా కేసులు, 10 వేలకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి.