Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ లీటరు పెట్రోల్, డీజిల్‌పై వరుసగా 36, 37 పైసల పెంపు
న్యూఢిల్లీ: చమురు ధరలు భగ్గు మంటున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులు నడ్డి విరుస్తున్నాయి. చమురు ధరల ప్రభావం ఇతర నిత్యావసరాల పై పడుతుండటంతో సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారం పడుతోంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై వరుసగా 36, 37 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశంలో అత్యధిక రికార్డు ధర లీటరు పెట్రోల్‌కు రూ.121.13, డీజిల్ ధర రూ.110.29 చేరింది. పై ధరలు మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదివరకు ఎప్పుడూ లేనంతగా చమురు ధరలు పెరిగి కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.108.99కి చేరగా, డీజిల్ రూ.97.72కు పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ రూ.114.81, డీజిల్ రూ.105.86కు చేరింది. దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లోనూ చమురు ధరలు భారీగా పెరిగాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ.109.46, డీజిల్ రూ.100.84, చెన్నైలో పెట్రోల్ రూ.105.74, డీజిల్ రూ.101.92కి చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై ధర రూ.113.36, డీజిల్ ధర రూ.106.60కు చేరింది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.112.79, డీజిల్ ధర రూ.103.72కు పెరిగింది.
ప్రజలపై మోడీ పెట్రో భారాలు: రాహుల్ గాంధీ
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా.. మోడీ సర్కారు మాత్రం దేశంలో పేదలపై పెట్రో భారాలు మోపుతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముడి చమురు ధరలు అధికంగా ఉన్నాయనీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నా ప్రజలపై పెట్రో భారాలు మోపుతున్నారని ఆరోపించారు.