Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోజికోడ్ : కేరళ రాజకీయాల్లో బీజేపీ ప్రాసంగికతను కోల్పోయిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పిపి.ముకుందన్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వరుస పరాజయాలతో పాటు అవినీతి ఆరోపణలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాజాగా ఆయన ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బీజేపీి నాయకత్వంపై విమర్శలు చేశారు. ఆరోపణలు వచ్చిన సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.సురేంద్రన్ ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సిందని అన్నారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారని అన్నారు.