Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు 13 వేల దిగువకు చేరుకున్నాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 11 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించగా, 12,830 మంది కరోనా బారిన పడ్డారు. 446 మంది మరణించారు. క్రితం రోజు కన్నా 10 శాతం కేసులు తక్కువ. మొత్తం కరోనా కేసులు 3.43 కోట్లను దాటగా, 4,59,186 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,667 మంది కోలుకుని ఇళ్లకు చేరుకోగా... మొత్తంగా రికవరీ అయిన సంఖ్య 3,36,55,842గా తెలిపింది. రికవరీ రేటు 98.20 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 1,59,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 247 క్రితానికి క్రియా శీలక కేసులు చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.46 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు 1,06,14,40,335 వ్యాక్సిన్లు వినియోగమయ్యాయి.