Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తంగా 397 మందికి అవార్డులు
న్యూఢిల్లీ : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)కి చెందిన 260 మంది సిబ్బందికి 'సెంట్రల్ హోం మినిస్టర్ స్పెషల్ ఆపరేషన్ మెడల్' అవార్డులను ఆదివారం ప్రకటించారు. చైనా పిఎల్ఎతో తూర్పు లడఖ్‌లో మిలిటరీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో సిబ్బంది చేస్తున్న అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఆదివారం తన నోటిఫికేషన్లో ప్రకటించింది. వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలకు చెందిన మొత్తం 397 మందికి అవార్డులు ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ఈ అవార్డులపై ఐటిబిపి అధికార ప్రతినిధి స్పందిస్తూ 'మే 2020, ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ సిబ్బంది తూర్పు లడఖ్ వద్ద ప్రదర్శించిన సాహసం, అంకితభావానికి గుర్తింపుగా అవార్డులు ప్రకటించారని తెలిపారు.'మంచుతో నిండిన శిఖరాలపై 'స్నో లేపార్డ్' ఆపరేషన్ ద్వారా తీవ్ర పరిస్థితుల్లో లడఖ్‌లోని సరిహద్దులను ఐటిబిపి సిబ్బంది రక్షించారని, ఉన్నత స్థాయి వ్యూహాత్మక ప్రణాళికలను, క్షేత్రస్థాయి కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. ఈ అవార్డు పొందిన వారిలో లేV్‌ాలోని ఐటిబిపి వాయువ్య సరిహద్దు మాజీ కమాండర్ ఐజి దీపం సేథ్ కూడా ఉన్నారు. గత ఏడాది కూడా చైనాతో ఉద్రిక్తతల సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 20 మంది ఐటిబిపి అధికారులు, సిబ్బందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పిఎంజి)ని కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించే వారికి ప్రకటించడం కోసం 2018లో కేంద్ర హోం మినిస్టర్ స్పెషల్ ఆపరేషన్ మెడల్‌ను ప్రవేశపెట్టారు.