Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మంది దుర్మరణం
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చక్రాతా తాలుకాలోని వికాశ్ నగర్లో సమీపంలోని బుల్హాద్-బైలా రోడ్డులో బస్సు లోయలోకి పడిపోవడంతో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారంతా బైలా గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఓవర్ లోడ్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చాలా చిన్న బస్సు అని, అందులో 25 మంది ఉన్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయనున్నట్లు సిఎం పుష్కర్‌సింగ్ ధామి ప్రకటించారు.