Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత మహిళతో కలిసి తమిళనాడు మంత్రి భోజనం
చెన్నయ్: తమిళనాడులోని ఒక ఆలయంలో కులం పేరుతో అవమానించబడిన మహిళకు సీఎం స్టాలిన్ అదే ఆలయంలో తగిన గౌరవం కల్పించారు. సీఎం ఆదేశాలతో ఆలయంలో అశ్వినిని పక్కన కూర్చోబెట్టుకొని దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు తాజాగా సహపంక్తి భోజనం చేశారు. నరిక్కురవ కమ్యూనిటీకి చెందిన అశ్విని కొన్ని రోజుల క్రితం మహాబలిపురంలోని ఒక ఆలయంలో కులవివక్షకు గురైంది. ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి అశ్వినితో పాటు నరిక్కురవ కమ్యూనిటీకి చెందిన ఇతరులను కూడా రానివ్వలేదు. ఆహారం కోసం ఎదురుచూస్తున్న అశ్వినిని బయటకు వెళ్లిపోవాలని ఆలయ అధికారి ఒకరు ఆదేశించారు. బయటకు పోవాలని, కార్యక్రమం పూర్తయిన తర్వాత మిలిగిన ఆహారాన్ని తీసుకుపోవాలని అధికారి హుకుం జారీచేశారని అశ్విని పేర్కొన్నారు. తమను అన్నదానానికి ఎందుకు అనుమతించడం లేదని అశ్విని ప్రశ్నిస్తున్న వీడియో ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆలయంలో చోటుచేసుకున్న ఈ కులవివక్ష ఘటన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దృష్టికి వెళ్లింది. సీఎం సూచనలమేరకు ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు అశ్వినిని కలిశారు.