Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 360 లక్షల బేళ్లకు పైగా పత్తి ఉత్పత్తి
- ఎగుమతులు 48 లక్షల బేళ్లు : సీఏఐ
న్యూఢిల్లీ : దేశంలో 2020-2021 (అక్టోబర్ -సెప్టెంబర్) ఏడాదికి గానూ పత్తి ఉత్పత్తిని 360.13 లక్షల బేళ్లుగా కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఐ) అంచనా వేసింది. గత సీజన్లో మొత్తం పత్తి ఉత్పత్తి 353 లక్షల బేళ్లుగా అంచనా వేయబడింది.అయితే, అది ప్రస్తుత సీజన్ కంటే 7.13లక్షల బేళ్లు తక్కువని సీఐఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది. '' పత్తి దిగుబడి అద్భుతంగా ఉంటుంది అంచనా. చక్కటి వర్షభావ పరిస్థితులతో నీటి లభ్యత ఉండటం కారణంగా రైతులు మూడు, నాలుగో పత్తి సేకరణకు వెళ్లాలని భావిస్తున్నారు''అని సీఏఐ అధ్యక్షుడు అతుల్ గనత్ర వెల్లడించారు. 2021-22 ముగింపు నాటికి మొత్తం పత్తి సరఫరా అంచనా 445.13 లక్షల బేళ్లు. ఇందులో ఓపెనింగ్ స్టాక్ 75 లక్షల బేళ్లు సీజన్ ప్రారంభానికి చెందినది. ఇక 2021-22 కాటన్ సీజన్‌కు గానూ ఎగుమతులను 48 లక్షల బేళ్లుగా సీఏఐ అంచనా వేసింది. గత సీజన్లో ఇది 78 లక్షల బేళ్లుగా ఉండటం గమనార్హం.