Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆదివారం ఆమెకు ఘన నివాళులర్పించారు. మహిళా శక్తికి ఆమె గొప్ప ఉదాహరణ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ శక్తి స్థల్‌లోని ఇందిరా గాంధీ సమాధిని రాహుల్ ఇతర కాంగ్రెస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. తన సొంత భద్రతా సిబ్బంది చేతిలో 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. 'మా నాయనమ్మ తన చివరి శ్వాస వరకూ భయం లేకుండా దేశానికి సేవ చేశారు. ఆమె జీవితం మాకు స్ఫూర్తిదాయకం' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇందిరాగాంధీకి నివాళులర్పించింది.
సర్దార్ వల్లబ్ భాయి పటేల్‌కు మోడీ, అమిత్ షా నివాళి
భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లబ్భాయి పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. 'సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ భారతదేశం సమర్థవంతంగా, అందరినీ కలుపుకొని, సున్నితత్వంతో, అప్రమత్తంగా, వినయంగా, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని మోడీ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో కేవడియాలోని ఉన్న 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' (వల్లబ్భారు పటేల్ విగ్రహం) వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.