Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశాలో అజరుమిశ్రా కాన్వారు అడ్డగింతకు యత్నం
- లఖింపూర్ ఖేరీ మారణకాండకు కారకుడంటూ..
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండలో భాగస్వామ్యం ఉన్నకేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా టెనికి నిరసన సెగ తగిలింది. ఒడిశాలో ఆయన కాన్వారును అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. మరోవైపు కాన్వారుపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్లోఖట్కర్ టోల్ ప్లాజా వద్ద యువకులు, విద్యార్థులు, రైతులు, కార్మికుల ఉమ్మడి మహా పంచాయత్ జరిగింది. ఈ మహా పంచాయత్‌కి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో అనేక మంది యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. షహీద్ కిసాన్ అస్థి కలశ్ యాత్రలు ముందుగా అనుకున్న విధంగా వివిధ ప్రదేశాలలో కొనసాగుతున్నాయి. ఒక యాత్ర యూపీలోని ఇటావా గుండా వెళుతుండగా, మరో మూడు యాత్రలు కేరళ, కర్నాటక, మహారాష్ట్రల మీదుగా సాగుతున్నాయి.
ఢిల్లీ సరిహద్దులకు భారీగా రైతులు
మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 340 రోజుకు చేరుకుంది. అన్ని సరిహద్దు ప్రాంతాల (మోర్చాలు)ను బలోపేతం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎస్కేఎం పిలుపు నిచ్చింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలలోని రైతులు,వ్యవసాయ కార్మికులు సరిహద్దులకు చేరుకోవాలని కోరింది.గత మూడు రోజులుగా వేలాది మంది రైతులు,వ్యవసాయ కార్మికులు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. టిక్రీ సరిహద్దు వద్ద గత చాలా నెలలుగా నిరసన చేస్తున్న రైతులు ఇప్పటికే అనుమతించినప్పటికీ,పోలీసులు బారికేడ్లతో రోడ్డు ను దిగ్బంధం చేశారు.అయితే ఇటీవలి పోలీసు బారికేడ్లను తొలగించిన తరువాత ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్‌ల రాకపోకలకు మార్గం సుగమైందని ఎస్కేఎం పేర్కొంది.
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించండి
డీఏపీ వంటి రసాయన ఎరువులను పొందడంలోరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారీస్థాయిలో ఉన్న క్యూ లైన్లో నిలబడి మరణాలు సంభవించాయని ఎస్కేఎం పేర్కొంది. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నఘటనతో సహా పలు ప్రాంతాల నుంచి వివిధ వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం వెంటనే ఎరువుల సరఫరాను సజావుగా చేయాలని, బ్లాక్-మార్కెటింగ్, ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.
సిట్ దర్యాప్తులో 75 వాంగ్మూలాల నమోదు
లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండకు సంబంధించిన దర్యాప్తులో సిట్ ఇప్పటివరకు 75వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పటివరకు 60మంది ప్రత్యక్ష సాక్షులకు భద్రత కల్పించారు.మరో16మంది సాక్షులకు కూడా భధ్రత కల్పించే అవకాశం ఉంది.న్యాయ సహాయం కోసం ఎస్కేఎం ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల న్యాయవాదుల బృందం సహాయం తీసుకోవాలని స్థానిక రైతులను ఎస్కేఎం ఆహ్వానించింది. హౌం వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న అజరు మిశ్రా టెనిని అరెస్టు చేసి, తొలగిం చాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తూనే ఉందని పేర్కొంది.
సర్కార్ ఆఫీసుల్ని మండీలుగా మారుస్తాం : రాకేష్ తికాయత్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని ఎస్కేఎం నేత రాకేశ్ తికాయత్ కోరారు. ఒక వేళ బలవంతంగా అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాన్నింటినీ ధాన్యం సేకరణ మార్కెట్లుగా (అనాజ్ మండీ) మారుస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం నాడు ఒక ట్వీట్లో హెచ్చరించారు. ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల్లోని బారికేడ్లు, సిమెంట్ బ్లాక్‌లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో తికాయత్ తాజాగా హెచ్చరించారు.