Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఆరు స్థానాలకు.. ఏపీలో మూడింటికి..
- వీటితో పాటు కేరళ, బెంగాల్‌ల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
- మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి..
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సం ఘం (ఈశఈఐ) ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది., తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు, ఏపీ నుంచి ముగ్గురి పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 29న పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించను న్నారు. అలాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3నాటికి ముగిసింది. ఏపీలో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి దేవసాని, మహ్మద్ షరీఫ్ పదవీకాలం మే 31 నాటికి ముగిసింది. ఆ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ, ఏపీతో పాటు కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు, మహారాష్ట్రలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలకు ఈసిఐ షెడ్యూల్ విడుదల చేసింది. కేరళకు చెందిన కేరళ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి కె. మణి జోషి, బెంగాల్‌కు చెందిన టీఎంసీ రాజ్యసభ ఎంపీ అర్పితా ఘోష్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శరద్ నామ్‌దేవ్ రాన్పిసే అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నికకు ఈసీఐ షెడ్యూల్ విడుదల చేసింది. శరద్ నామ్‌దేవ్ పదవీకాలం 2024 జులై 27 వరకు ఉంది. కానీ ఆయన 2021 సెప్టెంబర్ 23న మరణించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.