Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మహిళా మావోయిస్టులు హతం
రాయిపూర్ : ఛత్తీస్గడ్లో దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. వీరి ముగ్గురిపైనా రూ 15 లక్షల రివార్డు ఉంది. కటేకళ్యాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అద్వాల్, కుంజెరాస్ గ్రామాల మధ్య ఉన్న అడవిలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని రాజే ముచకి, గీతా మార్కం, జ్యోతి అలియాస్ బీమే నుప్పోగా గుర్తించామని ఆయన తెలిపారు. మావోయిస్టుల కటేకల్యాన్ ప్రాంతం కమిటీకి చెందిన వీరిపై ఒకొక్కరిపై రూ 5 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఓక 12 బోర్ గన్, రెండు దేశవాళీ తుపాకీలు, ఒక ముజెల్ లోడింగ్ గన్, రెండు ఐఈడీలు, ఔషధాలు, మావోయిస్టు సాహిత్యంను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.