Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నరేగా' పథకంలో ఉపాధికి పెరిగిన డిమాండ్
- పనులు కావాలని అడుగుతున్న రెండు కోట్లకుపైగా కుటుంబాలు
- కోవిడ్ ఆంక్షలు ఎత్తేసినా తగ్గని డిమాండ్
- సెప్టెంబర్లో 2.07కోట్ల కుటుంబాలకు 'నరేగా' పథకం అమలు
న్యూఢిల్లీ : కోవిడ్ ఆంక్షలు సడలించాక కూడా 'ఉపాధి హామీ' పనులకు డిమాండ్ తగ్గ లేదు. జాబ్ కార్డులు పొందిన వారిలో..తమకు పని చూపాలని అడిగేవారి సంఖ్య అనూ హ్యంగా పెరుగుతోంది. 'నరేగా' పోర్టల్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్లో 2.07కోట్ల కుటుంబాలకు పథకం వర్తించింది. 2019, 2020 సెప్టెంబర్ నెలతో పోల్చితే ఉపాధి పని చూపాలని కోరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలు స్తోంది. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు ఎత్తే సిన తర్వాత కూడా ఉపాధి పనుల కోసం డిమాండ్ ఈస్థాయిలో నెలకొనటంపై నిపుణు లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనం తరం ఉపాధిరంగం ఇంకా కోలుకోలేదనడానికి 'నరేగా' పోర్టల్ విడుదల చేసిన గణాంకాలే ఆధారమని వారు చెబుతున్నారు. దేశవ్యాప్తం గా ఉపాధి సమస్య తీవ్రస్థాయిలో ఉందన్న విషయం వారు గుర్తుచేస్తున్నారు.
'నరేగా' పోర్టల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గతఏడాది డిసెంబర్ తర్వాత ఉపాధి హామీ పనుల కోసం డిమాండ్ క్రమంగా పెరు గుతూ వస్తోంది. కోవిడ్ అనంతరం గత 18 నెలల్లో కేవలం మూడు నెలల్లో మాత్రమే డిమాండ్ 2కోట్లకు దిగువన నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి ఆరు నెలల్లో నరేగా పథకం వర్తించిన సగటు కుటుం బాల సంఖ్య 2.36కోట్లు. దీనికంటే ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2.28కోట్లు, 2019-20లో 1.56కోట్లుగా ఉంది.
అత్యధికంగా తమిళనాడులో..
ఇకా రాష్ట్రాల వారీగా చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్లో అత్యధికంగా తమిళనాడులో 46.54లక్షల కుటుంబాలకు పథకం వర్తిం చింది. ఆతర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ (23.47లక్షలు), యూపీ(19.57లక్షలు), రాజస్థాన్(18.73), మధ్యప్రదేశ్ (14.56 లక్షలు) రాష్ట్రాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లలో నరేగా ద్వారా ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 30శాతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 30నాటికి 6.02కోట్ల కుటుం బాలకు చెందిన 8.57 కోట్ల మందికి 'నరేగా' ద్వారా ఉపాధి దొరికింది. గత ఆర్థిక సంవత్స రం(2020-21)లో మొత్తం 7.5కోట్ల కుటుం బాలకు చెందిన 11కోట్లమందికి పథకం ద్వారా ఉపాధిచూపారు. నరేగా పథకంలో మెటీరియ ల్, నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.8701 కోట్లకు చేరుకున్నాయి. వీటిని తప్పకుండా విడుదల చేస్తామని రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది.
నిధులు సరిపోవు : పీఏఈజీ నివేదిక
కేంద్రం కేటాయించిన నిధుల్లో 90శాతం అక్టోబర్ నాటికి ఖర్చు అయ్యాయని, మిగిలిన 5నెలల కోసం కేవలం10శాతం నిధులు మాత్రమే విడుదల కావొచ్చునని 'పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ' (పీఏఈజీ) అనే సంస్థ తెలిపింది. రాబోయో రోజుల్లో పథకం అమలు పైఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నది.10శాతం నిధులు కేవలం13రోజులకు మాత్రమే సరిపోతాయని తేలింది.నరేగా కింద దేశవ్యాప్తంగా17కోట్లమందికి జాబ్ కార్డు ఇచ్చారు.ఇందులో కేవలం9.71 కోట్లమంది జాబ్ కార్డులకు పథకం వర్తిస్తోందని పీఏఈజీ తెలిపింది.