Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
న్యూఢిల్లీ : నీట్-యూజీ 2021ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్ క్లియర్ చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు ప్రకటించింది. నీట్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరికి మొదటి ర్యాంకుతో మెరిశాడు. విజయవాడకు చెందిన విద్యార్థి రుషీల్ ఐదో ర్యాంకుతో సత్తా చాటగా.. పీవీ కౌశిక్ రెడ్డి అనే మరో విద్యార్థి 23వ ర్యాంకు సాధించాడు. కౌశిక్ రెడ్డి కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కావడం విశేషం. హైదరాబాద్కు చెందిన విద్యార్థి ఖండవల్లి శశాంక్ ఆలిండియా ఐదో ర్యాంకు సాధించగా.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన విద్యార్థిని శరణ్య 60వ ర్యాంకుతో నిలిచారు. అలాగే, ఢిల్లీకి చెందిన తన్మరు గుప్తా , మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్ మొదటి ర్యాంకు సాధించారు.. ఫలితాలను %ష్ట్ర్్జూ://అవవ్.అ్a.అఱష.ఱఅ%/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.