Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానిటైజేషన్ స్కీంలో భాగంగా..
న్యూఢిల్లీ : స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు వంత పాడే పద్దతిని మరింత పెంచుతోంది. తాజాగా ఓఎన్జీసీలోని ఓ యూనిట్‌ను విదేశీ కంపెనీకి అప్పగించేలా ఒత్తిడి తీసుకువస్తోంది. ఓఎన్జీసీ ఉన్న అతిపెద్ద యూనిట్లలో ఒక్కటైన ముంబయి హై అండ్ బాసెన్లో విదేశీ కంపెనీలకు 60 శాతం పైగా వాటాను అప్పగించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు అక్టోబర్ 28న లేఖ రాసింది. ఈ అంశంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అమర్ నాథ్ ఓఎన్జీసీ సీఎండీకి మూడు పేజీల లేఖ పంపించారు. ఇది వరకు కూడా ఏప్రిల్ 1న కేజీ బేసిన్‌లోని క్షేత్రాలను విక్రయించాలని ఆయన ఓఎన్జీసీకి సూచించారు. మోడీ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా ఈ విక్రయాలు కొనసాగుతున్నాయి.