Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంఢగీఢ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం తన కొత్త పార్టీ పేరును 'పంజాబ్ లోక్ కాంగ్రెస్'గా ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అనుమతి వచ్చిన తరువాత గుర్తును ప్రకటిస్తానని తెలిపారు. సెప్టెంబరు 18న అమరీందర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రవర్తనతో బాధపడినందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.