Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి : లైంగిక బాధితురాల్ని బెదిరించారనే ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై కేరళ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఒక లైంగిక కేసులో బాధితురాలికి అక్టోబర్ 27న కలామాస్సారీ పట్ణణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు వైద్యులు తనను బెదిరించారని, అవాంఛనీయమైన వివరాలను అడిగారని బాధితురాలు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీసులు ఈ ఫిర్యాదును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కాగా, తన సంస్థలో పనిచేసే ఒక కార్మికురాలి కుమార్తెపై లైంగిక వేధింపులకు ప్పాలడ్డంతో కలూర్లో ఒక కాస్సోటిక్స్ సంస్థ యజమాని మాన్సన్ మావుంకుల్పై పోస్కో చట్టం కింద కేసు నమోదయింది. ఈ కేసులో బాధితురాలే ఈ ఫిర్యాదు చేశారు. మాన్సన్ మావుంకుల్ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారమే అరెస్టు చేశారు.