Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మందిపై అభియోగాలు
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకేసుతో సంబంధం ఉన్న 17 మంది నిందితులపై సిటీ కోర్టు అభియోగాలు మోపింది. తదుపరి విచారణ డిసెంబర్ 8న జరగనుంది. అదే రోజున కేసు విచారణ, శిక్షలు వంటి అంశాలు వెల్లడికానున్నాయి. కాగా, ప్రత్యేక దర్వాప్తు బందం (సిట్) మూడేండ్ల క్రితం ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ.. విచారణ ప్రారంభించడానికి అవసరమైన అభియోగాలను రూపొందించడంలో ఆలస్యం చేసే విధంగా నిందితులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిపై అభియోగాలు మోపడంలో ఆలస్యం జరిగింది. అయితే, నిందితుడు మోహన్ నాయక్ పై కర్నాటక కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్-2000ను సుప్రీంకోర్టు సమర్థించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రత్యేక కోర్టు 17 మంది మంది నిందితులపై అభియో గాలు మోపింది.తాజాగా జరిగిన విచారణలో బెంగళూరు సెంట్రల్ జైలు, పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైలు, ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి నిందితులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు.
నిందితులు విచారణను కోరారు. ఇక కోర్టు ఆదేశాలు లేకుండా నిందితులను మరో జైలుకు తరలించవద్దని ఆదేశించింది. నిందితులపై హత్య, క్రిమినల్, ఆయుధాలు కలిగివుండటం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయబడ్డాయి. కాగా, పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5న రాజేశ్వరినగర్‌లోని ఐడియల్ హౌమ్స్ లేఅవుట్లోని తన ఇంటి వెలుపల హత్యకు గురైన సంగతి తెలిసిందే.