Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరు పెట్రోల్‌పై 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. నిత్యం చమురు కంపెనీలు ఇంధన ధరలు పెంచుతుండటంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మంగళవారం వరుసగా ఏడో రోజుకూడా పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.110.04కు పెరిగింది. డీజిల్ ధర లీటరు రూ.98.42కు చేరింది. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నా దేశంలో మాత్రం చమురు ధరలు పైపైకి చేరుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చమురు ఉత్పత్తులపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులేనని తెలుస్తోంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం వాహనదారులతో పాటు సామాన్య ప్రజానీకంపైనా ఆర్థిక భారం మోపుతున్నాయి.
తాజాగా పెరిగిన ఇంధన ధరలతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.115.85, లీటరు డీజిల్ ధర రూ.106.62కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.49, డీజిల్ రూ.101.56గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.66, డీజిల్ 102.59కి చేరింది. బెంగుళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.113.93, 104.50గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.114.49, డీజిల్ రూ.107.40కి పెరిగింది. మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధరలు రూ.120 దాటాయి. దేశంలోనే అత్యధికంగా చమురు ధరలు రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.122.70, డీజిల్ ధర రూ.113.21గా ఉంది. సెప్టెంబర్ 28 నుంచి దేశంలో పెట్రోల్ ధరలు 27 సార్లు పెరిగాయి.