Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప : బద్వేల్ సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ భారీ మెజార్టీతో తిరిగి దక్కించుకుంది. బద్వేల్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ప్రతి రౌండులోనూ సగటున 8,500 నుంచి 9,500 ఓట్ల అధిక్యత సాధించారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు, బిజెపి అభ్యర్థి పి.సురేష్‌కు 21,678 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఎం.కమలమ్మకు 6,235 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి 90,533 ఓట్ల మెజార్టీతో బిజెపిపై విజయం సాధించారు.