Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్కు చెందిన 'కిలో క్లాస్' జలాంతర్గ్గాములకు చెందిన రహస్య సమాచారాన్ని 'అనధికార వ్యక్తులకు' చేరవేశారనే ఆరోపణలతో ఇద్దరు నేవీ కమాండర్లు, ఇద్దరు నేవీ మాజీ అధికారులతో సహా ఆరుగురిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), అవినీతి నిరోధక చట్టం కింద చార్జిషీటు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 3న నేవీ మాజీ అధికారులు రణదీప్ సింగ్, ఎస్జె సింగ్లను అరెస్టు చేసిన తరువాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సోదాల్లో రణదీప్ సింగ్ వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. నేవీ నుంచి పదవీ విరమణ చేసి ప్రస్తుతం విదేశీ సంస్థల్లో పనిచేస్తున్న మాజీ అధికారులకు ప్రస్తుతం కమాండర్లుగా ఉన్న నిందితులు జలాంతర్గాములు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారని సిబిఐ ఆరోపిస్తుంది.