Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. రబీ సీజన్ ప్రారంభం కాలంలో ఎరువుల కొరత తీవ్రస్థాయికి చేరడంతో అన్నదాతలు ఆందోళనకు గురువుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు కో-ఆపరేటివ్ సొసైటీల ముందు ఎరువుల కోసం భారీ క్యూల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎదరుచూసినా వారికి నిరాశ తప్పడం లేదు. మళ్లీ తరువాత రోజు ఇదే పరిస్థితి. రాష్రంలో ముఖ్యంగా బుందేల్‌ఖండ్ రీజన్లో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా హమిర్పూర్, లలిత్పూర్, హత్రాస్, ఇత్వా, ఫరూక్బాద్, ఫిరోజాబాద్, ఇతV్‌ా, బండా, మైన్పూర్, కన్నౌజ్ జిల్లాలో ఎరువుల కొరతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక లలిత్పూర్ ప్రాంతంలో ఎరువుల కొరత ప్రాణాంతక ంగా మారింది. ఎరువుల కొరత ఈ జిల్లాలో ఐదుగుర్ని బలి తీసుకుంది. లలిత్పూర్ జిల్లాలోని మసౌరఖుర్డ్ గ్రామానికి చెందిన ఒక మధ్య వయస్కు రైతు రఘువీర్ పటేల్ శనివారం తన పొలంలో చెట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల నుంచి ఎరువుల పంపిణీ కేంద్రాలకు వెళ్లి వట్టి చేతులతో వస్తున్నాడని, సమయానికి ఎరువులు దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని సూసైట్ లేఖలోనూ ఇదే ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పోలీసులు గుర్తించారు. ఇతని భార్య 13 ఏళ్ల క్రితం కాన్సర్‌తో మరణించింది. దీంతో వీళ్ల ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె అనాధలయ్యారు.
అక్టోబర్ 23న జుగ్పురా ప్రాంతంలో ఒక రైతు ఎరువుల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కొల్పొయాడు. అంతకు ముందు రెండు రోజుల నుంచి ఆ రైతు క్యూలో నిలబడి ఉంటున్నారని స్థానికులు తెలిపారు. ఇతన్ని నాయగాన్ గ్రామానికి చెందిన భోగి పాల్గా గుర్తించారు.బన్యన గ్రామానికి చెందిన మహేష్ బుంకర్ అనే రైతు కూడా వరసగా మూడు రోజుల పాటు క్యూలో నిలబడి ప్రాణాలు కొల్పోయాడు. మైయిల్వారా గ్రామానికి చెందిన సోని అహిర్వార్, బుందేల్‌ఖండ్‌కు చెందిన బల్లూ పాల్ ఎరువులు కొనడంలో విఫలంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.యూపీలో ఎరువుల కొరతకు యోగి అధిత్యనాధ్ ప్రభుత్వమే కారణమని ఎఐకెఎస్ రాష్ట్ర కార్యదర్శి ముకుత్ సింగ్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అండతోనే ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. రూ 1200 ఉండే డీఏఫఈ బస్తా బ్లాక్ మార్కెట్లో రూ 2 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉన్న విద్యుత్ కొరతకు ఎరువుల కొరత తోడయిందని విమర్శించారు.
మరోవైపు ఎరువుల కొరతపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రతీ దశలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు.