Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబర్ల్లో దేశంలో 125 అత్యంత అతి భారీ వర్షపాతాలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం తెలిపింది. గత ఐదేండ్లలో ఇదే అత్యధికమని ప్రకటించింది. నైరుతీ రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యంగా జరగడం, ఎక్కువ అల్పపీడనాలు ఏర్పడ్డం వంటి కారణాలతో ఇది సంభవించిందని పేర్కొంది.
ఈ ఏడాది సెప్టెంబరులో 89 అత్యంత అతి భారీ వర్షాపాతాలు నమోదయ్యాయని చెప్పింది. ఈ సంఖ్య 2020లో 61గా ఉందని చెప్పింది. 2019లో 59, 2018లో 44, 2017లో 29 అత్యంత అతి భారీ వర్షపాతలు నమోదయ్యాయని వెల్లడించింది.
ఇక, ఈ ఏడాది అక్టోబర్లో 36 అత్యంత అతి భారీ వర్షపాతాలు నమోదు కాగా, 2020లో 10, 2019లో 16, 2018లో 17, 2017లో 12 నమోదయ్యాయని తెలిపింది.
ఈ రెండు నెలల్లో రెండు తుపానులు, ఒక తీవ్ర అల్పపీడనం, 6 అల్పపీడనాలతో సహా మొత్తంగా 9 అల్పపీడనాలు ఏర్పాడ్డాయని పేర్కొంది.
15 మీమీ కంటే తక్కువ వర్షపాతం నమోదైతే తక్కువ వర్షపాతం గానూ, 15 మీమీ నుంచి 64.5 మీమీ వరకూ ఒక మోస్తారు వర్షపాతంగానూ, 64.5 మీమీ నుంచి 115.5 మీమీ వరకూ భారీ వర్షపాతంగానూ, 115.6 మీమీ నుంచి 204.4 మీమీ వరకూ అతి భారీ వర్షపాతం గానూ, 204.4 మీమీ కన్నా ఎక్కువ వర్షపాతాన్ని అత్యంత అతి భారీ వర్షపాతంగానూ గుర్తిస్తారు.