Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శిగా అమ్రారామ్ తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) రాజస్థాన్ రాష్ట్ర 23వ మహాసభలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు మూడు రోజులపాటు సికార్‌లో జరిగాయి. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, హన్నన్ మొల్లా, పార్టీ నేత జ్ఞానశంకర్ మజుందార్ హాజర య్యారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి అమ్రారామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా 27 మంది, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఏడుగురు ఎన్నికయ్యారు. కార్మిక, కర్షక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని మహాసభ పిలుపు ఇచ్చింది.