Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత విఎస్ అచ్యుతానందన్ (98) అనారోగ్యంతో ఆదివారం ఆస్పత్రిలో చేరారు. జీర్ణకోశ (గాస్ట్రో ఎంటెరిటీస్), కిడ్నీ (డైసెలక్ట్రోమి యా) సమస్యలతో పథోమ్లోని శ్రీ ఉతరాథోమ్ తిరునల్ ఆస్పత్రిలో చేరారనీ, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సీపీఐ(ఎం) ట్వీట్ చేసింది.