Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్లో 7.75శాతం : సీఎంఐఈ
- నాలుగు నెలల గరిష్టస్థాయికి గ్రామీణ నిరుద్యోగం
న్యూఢిల్లీ : కోవిడ్-19 ఆంక్షలు ఎత్తేసి చాలా రోజులయింది. పండగలొస్తున్నాయి. పోతు న్నాయి. కానీ దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడంలేదు. క్రితం నెలతో పోల్చితే అక్టోబర్లో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగ రేటు సెప్టెంబర్లో 6.86శాతం నమోదుకాగా, అక్టోబర్నాటికి 7.75శాతానికి చేరుకుందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ'(సీఎంఐఈ) గణాంకాలు విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగరేటు స్వల్పంగా తగ్గినప్పటికీ (7.38శాతం), గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగరేటు నాలుగు నెలల (అక్టోబర్ నాటికి 7.91శాతం)గరిష్టానికి చేరు కుందని తాజా నివేదిక తెలిపింది. గ్రామీణ నిరుద్యోగేటు భారీగా పెరగడం వల్ల పట్టణ నిరుద్యోగరేటు స్వల్పంగా తగ్గినా.. మొత్తంమీద అక్టోబర్ నెలలో దేశవ్యాపిత నిరు ద్యోగరేటు పెరిగిందని సీఎంఐఈ తెలిపింది. రాబోయేది పండుగల సీజన్, రిటైల్ వాణిజ్యం, ఇతర రంగాల్లో ఉపాధి పుంజుకుంటుందని, ఈ నేపథ్యంలో నిరుద్యోగరేటు తగ్గొచ్చునని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేశ్ వ్యాస్ గత నెలలో అంచనావేశారు. అయితే ఆయన అం చనా తప్పింది. నిరుద్యోగంతో బాధేపడే వారికి ఉన్నఫళంగా ప్రయివేటురంగంలో ఉపాధి దొరికే అవకాశంలేదని నివేదిక అంచనావే సింది. నమోదైన గణాంకాలను బట్టి దేశవ్యా ప్తంగా నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉండొచ్చు. 85లక్షల మంది కొత్తగా ఉపాధిరంగంలోకి రావటం వల్ల సెప్టెంబర్లో నిరుద్యోగరేటు 6.86శాతానికి తగ్గింది. ఈఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 40.62కోట్లమంది ఉపాధిని కలిగివున్నారు. గతఏడాది మొదలైన కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఇంతమంది ఉపాధిని కలిగివుండ టం ఇదేమొదటిసారి. అయినప్పటికీ ఉపాధిరంగంలో కోవిడ్-19 సంక్షోభం ముందునాటి పరిస్థితులు ఏర్పడలేదు. కోవిడ్ సంక్షోభం మొదలుకాక ముందు 2019-20లో ఉపాధిపొందిన కలిగినవారి సంఖ్య 40.89కోట్లు.