Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుమారు 18 నెలల విరామం తరువాత పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రారంభమైన సమయంలో విద్యలో అసమానతలు మరింత తీవ్రతరం దాల్చనున్నాయని ఓ అధ్యయనం హెచ్చరించింది. 15 రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన సర్వే అధారంగా నేషనల్ కొలినేషన్ ఆన్ ది ఎడ్యుకేషన్ ఎమెర్జన్సీ (ఎన్సీఈఈ) ఒక నివేదిక విడుదల చేసింది. లాక్డౌన్ సమయంలో ప్రాథమిక స్ధాయి విద్యార్థుల్లో 72 శాతం మంది ఏ విధమైన పద్దతుల్లోనూ తమ రోజువారీ చదువులను కొనసాగించలేదని నివేదిక తెలిపింది. గ్రామీణ విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే అన్లైన్ చదువులు అందుబాటులో ఉన్నాయిని చెప్పింది. అలాగే కర్నాటకలో 8వ తరగతి విద్యార్ధుల్లో ఎక్కువ శాతం గణితం, లాంగ్వేజ్ సబ్జెక్టులో తమ గ్రేడ్‌ను అందుకోలేకపోతున్నారని ఆ తరగతి ఉపాధ్యాయుల్లో 85శాతం మంది చెప్పినట్టు నివేదిక తెలిపింది. అలాగే 10వ తరగతి ఉపాధ్యాయులు ఇదే విషయాన్ని అంగీకరించారని పేర్కొంది. లాక్డౌన్ సమయంలో గ్రామీణ, పట్టణ పేదలు, వలసదారులు, మైనార్టీలు, దళితులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొంది. 'పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు, విద్యార్ధులు రెండేళ్ల క్రితం ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి పున:ప్రారంభించలేం. కొత్త సిలబస్‌కు వారు సిద్ధంగా ఉంటారని ఆశించలేం' అని చిన్నారుల హక్కు రక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మాజీ చీఫ్ శాంతా సిన్హా తెలిపారు.
ఈ నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతా సిన్హా మాట్లాడుతూ 'లాక్డౌన్లో అనేకం జరిగాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, ఆత్మగౌరవంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి' అని అన్నారు.