Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : లఖీంపూర్ ఖేరి మారణకాండ కేసులో నిందితులు ఆశీష్ మిశ్రా, మరో ఇద్దరి బెయిల్ పిటీషన్ విచారణను ఈ నెల 15కు కోర్టు వాయిదా వేసింది. లఖీంపూర్ ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన మారణాకాండలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా, ఆశీష్ పాండే, లవ్‌కుశ్ రానేతో సహా 13 మందిని అరెస్టు చేశారు. ఆశీష్ మిశ్రా, ఇతరుల బెయిల్ పిటీషన్‌ను బుధవారం లఖీంపూర్ ఖేరి జిల్లా అండ్ సెషన్స్ జడ్జి ముకేష్ మిశ్రా ఈ నెల 13కి వాయిదా వేశారు.