Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను తొక్కించిన బీజేపీ కార్యకర్తల న్యాయంపై స్పందిస్తారా...: సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం
- అమరవీరుల గౌరవార్థం ఒక దీపం వెలిగించండి
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీ తన వాహనాల కాన్వారుతో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను ఎలా తొక్కించారో ప్రస్తావించకుండా, బీజేపీ కార్యకర్తలకు న్యాయం గురించి సిగ్గులేకుండా మాట్లాడారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. ఆయన సమావేశానికి రావాలని స్థానిక రైతులను పిలిస్తే, వారు దాన్ని తిరస్కరించారని ఎస్కేఎం పేర్కొంది. అజరు మిశ్రా టెనిని కేంద్రమంత్రిగా కొనసాగడం సహించరానిదనీ, అనైతికమని, ఆయనను తక్షణమే తొలగించి అరెస్టు చేయాలని ఎస్కేఎం మరోసారి డిమాండ్ చేసింది.ప్రతి ఒక్కరికీ ఎస్కేఎం దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుందనీ, రైతుల ఉద్యమ డిమాండ్లను మోడీ ప్రభుత్వం నెరవేర్చినప్పుడే నిరసన తెలిపే రైతులకు, వేడుకల సమయం అప్పుడే వస్తుందని పేర్కొంది. మోడీ ప్రభుత్వ మొండిగా అప్రజాస్వామిక, అహేతుక వైఖరి కారణంగా ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని తెలిపింది. రైతుల హక్కులు, జీవనోపాధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన రైతు-అమరవీరుల గౌరవార్థం దీపావళి నాడు ఒక దీపాన్ని వెలిగించాలని ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. నేడు (గురువారం) దేశవ్యాప్తంగా ఇండ్ల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పౌరులందరూ దీపాలు వెలిగించాలని కోరింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలిపే రైతులతో కలిసి దీపావళిని జరుపుకోవడానికి పౌరులను ఎస్కేఎం ఆహ్వానించింది. నవంబర్ 26న దేశవ్యాప్త నిరసన దినం పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. జింద్‌లో నిరసన తెలుపుతున్న రైతులకు, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.