Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో (అక్టోబర్నెల) నిరుద్యోగం పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐసీ) పేర్కొంది. అయితే నిరు ద్యోగంలో బీజేపీ పాలిత హర్యానా ప్రథమస్థానంలో ఉన్నది. అక్కడ జాతీయ సగటు కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ నిరుద్యోగ రేటును నమోదైంది. జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదు అయిన రాష్ట్రాల్లో హర్యానా (30.7 శాతం), రాజస్థాన్ (29.6 శాతం), జమ్మూకాశ్మీర్ (22.2 శాతం), జార్ఖండ్ (18.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.1 శాతం), బీహార్ (13.9 శాతం), గోవా (11.7 శాతం), పంజాబ్ (11.4 శాతం), ఢిల్లీ (11 శాతం), సిక్కిం (10 శాతం), త్రిపుర (9.9 శాతం)లు ఉన్నాయి.
తెలంగాణలో పైపైకి..ఏపీలో కిందకి
తెలంగాణలో నిరుద్యోగ రేటులో పెరుగుదల కనిపించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ రేటులో తగ్గుదల కనిపించింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే తక్కువ నమో దైంది. తెలంగాణలో 4.2 శాతం నిరుద్యోగ రేటు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 5.4 శాతం నమోదైంది. తెలంగాణలో సెప్టెంబర్ లో 3.7 శాతం నమోదు కాగా, అక్టోబర్ వచ్చే సరికి అది కాస్తా 4.2 శాతానికి పెరిగింది. ఏపీలో ఆగస్టు నుంచి నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. జాతీయ సగటు కంటే తక్కువే నమోదు అవుతుంది. ఆగస్టులో 6.5 శాతం నమోదు అయిన నిరుద్యోగ రేటు, సెప్టెంబర్‌లో 6.3 శాతం నమోదు అయింది. అది కాస్తా అక్టోబర్‌కు వచ్చే సరికి 5.4 శాతం నమోదు అయింది.