Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం అను మతి ఇచ్చింది. 'కోవాగ్జిన్ వ్యాక్సిన్ కోవిడ్-19 నుండి రక్షణ కోసం డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, వ్యాక్సిన్ యొక్క ప్రయోజ నం ప్రమాదాలను అధిగమిస్తుందని, వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చనని డబ్ల్యూ హెచ్ఓ సమావేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ నిపుణులతో రూపొం దించబడిన టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ నిర్ధారించింది' అని సంస్థ ట్వీట్ చేసింది. 18 ఏండ్లు నిండిన వారికి రెండు డోసుల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చనీ, రెండు డోసుల మధ్య వ్యవధి నాలుగు వారాలు ఉండాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.