Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ/మంచాల : ''కేవలం పనికిరాని వాగ్దా నాలతో సరిపుచ్చే ప్రపంచ నేతలను చూస్తుంటే మా యువతరానికి కోపం, ఆవేశం వస్తోంది'' అని గ్లాస్గోలో జరుగుతున్న కాప్-26 సదస్సులో భారత్ కి చెందిన 15 ఏండ్ల వనీషా ఉమాశంకర్ అన్నారు. మాటలతో కాలాన్ని వెళ్లబుచ్చడం మాని పర్యావర ణాన్ని రక్షించేందుకు గట్టి చర్యలు చేపట్టాలని పిలు పునిచ్చారు. ''ఎకో ఆస్కార్స్''గా పిలువబడే ఎర్త్‌షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్‌లలో ఒకరైన తమిళనాడుకు చెందిన వినీషా ఉమా శంకర్‌ను ప్రిన్స్ విలియం సదస్సులో క్లీన్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ గురించి చర్చించే సమావేశంలో మాట్లాడేందుకు ఆహ్వానించారు. ''మర్యాదపూర్వకంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక మనం మాటలు మాని చేతలు ప్రారంభించాలి. మేము ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్ట్లం.. మీరు మా ఆవిష్కరణలు, ప్రాజెక్టులు, పరిష్కారాలకు మద్ద తునివ్వాలి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యాలపై మన దేశాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించొద్దు. చర్చలు ఇకపై నిలిపివేయండి. ఎందుకంటే కొత్త భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేయడం అవసరం. అందుకే మీ సమయాన్ని, డబ్బును మన భవిష్యత్‌ను మరింత ప్రయోజనకరంగా మార్చేందుకు వెచ్చించాలి'' అన్నారు. ప్రధాని మోడీ, బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్లు హాజరైన ఈ కార్యక్రమంలో వనీషా ఉద్వేగభరితంగా ప్రసంగిం చారు. ''వర్క్షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టుల తరపున మాతో చేరాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మాకు మద్దతుగా నిలవాలని, పాత ఆలోచనా విధానాలను, పాత అలవాట్లను వదులుకుంటారని ఆశిస్తున్నాను. మీకు చేతకాకుంటే.. మేమే నాయ కత్వం వహిస్తాం .. మేమే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ గతంలో చిక్కుకుపోయిన మీరు భవిష్యత్ నిర్మాణం కోసం మాతో కలవాలని కోరుకుంటు న్నాను. మీరు బాధపడే అవకాశం రాదని నేను హామీ ఇస్తున్నాను'' అంటూ ధైర్యంగా తన భావాలను వెలిబుచ్చారు. వినీషా ఉమాశంకర్ రూపొందించిన సోలార్ ఇస్త్రీ బండి ఎర్త్‌షాట్ ప్రైజ్‌లో బహుమతికి ఎంపికైంది. బొగ్గును మండించే పాత విధానానికి బదులుగా సోలార్ శక్తితో ఇస్త్రీబండిని రూపొందించి అందరి మన్ననలు పొందారు. వాతావరణ మార్పుల విషయానికొస్తే.. 'స్టాప్ బటన్' లేదని మరోసారి పునరుద్ఘాటించారు. కేవలం వాగ్దానాలకే పరిమిత మైన నేతలను చూస్తే.. తమ యువతరానికి ఆగ్ర హం వస్తోందని, కాని ఆగ్రహానికి కూడా ప్రస్తుతం సమయం లేదని, చేతలతోనే నిరూపించాలని తాను కేవలం భారత్‌కి చెందిన బాలికను మాత్రమే కాదనీ.. తాను ఈ ప్రపంచానికంతటికీ కుమార్తెనని, ఇందుకు తాను గర్వపడుతున్నాను, తానో విద్యార్థిని, శాస్త్రవేత్త ను, పర్యావరణవేత్తను, వ్యవస్థాపకురాలిని అంతకు మించి ముఖ్యంగా తానో ఆశావాదినని అన్నారు.