Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గింపు
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుదలతో అల్లాడిపో తున్నా.. మోడీ సర్కార్ పట్టించుకోలేదు. అయితే దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నిక ల్లో భంగపడ్డ బీజేపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఇంధనధరల్ని స్వల్పంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం తో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పెట్రోల్ కంటే రెట్టింపుగా ఉండటంతో రాబోయే రబీ సీజన్లో రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉండనుందని పేర్కొంది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు మరింతగా ఊరటగా ఉంటుందని కేంద్రం కోరినట్టు సమాచారం. అయితే అంతర్జాతీయ బూచిగా చూపించి ఎప్పుడైనా ఇంధన ధరల్ని మళ్లీ పెంచే అవకాశాలు లేకపోలేదు.