Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి స్థానంలో ఉత్తరప్రదేశ్
- మధ్యాహ్నం భోజన పథకం అమలులో అట్టడుగున తెలుగు రాష్ట్రాలు
- ఉపాధి హామీ అమలులోనూ మొదటి స్థానంలో కేరళ
న్యూఢిల్లీ : ఉత్తమ పరిపాలనలో కేరళ అగ్రభాగాన నిలిచింది. తమిళనాడు, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిశాయి. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ చివరి స్థానాల్లో నిలిశాయి. దేశంలోని రాష్ట్రాల అభివద్ధి, పరిపాలనపై పబ్లిక్ అఫెర్స్ ఇండెక్స్ (పీఏఐ)-2021 నివేదికను పబ్లిక్ అఫెర్స్ సెంటర్ (పీఏసీ) విడుదల చేసింది. కరోనా కాలంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజల బాగోగులు అన్ని వర్గాల కు సమానత (ఈక్విటీ)లో పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజ రాత్, కేరళ, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో నిలి చాయి. కర్నాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 10 (మైనస్0.086) స్థానాలోనూ, తెలంగాణ 6 (0.542)స్థానంలోనూ నిలిచాయి. చిన్న రాష్ట్రాల విభాగంలో సిక్కిం, మేఘాలయా, మిజోరం మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగున ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్, ఛండీగడ్ మొదటి స్థానంలో నిలిచాయి. లక్షదీప్, అండమాన్ నికోబార్, దాద్రా నగర్ హావేలీ చివరి స్థానాల్లో నిలిచాయి. అభివృద్ధిలో పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ, కేరళ, జార్ఖండ్ మొదటి స్థానాల్లో నిలివగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ చిట్ట చివరిలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 11 స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలోనూ, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. చిన్న రాష్ట్రాల విభాగంలో గోవా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ మొదటి స్థానాల్లో నిలివగా, మణిపూర్, నాగాలాండ్, మేఘాల యా చివరి స్థానాల్లో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో పుదుచ్చేరి, దాద్రానగర్ హావేలి, లక్షదీప్ మొదటి స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానాల్లో జమ్మూ కాశ్మీర్, ఛండీగడ్, అండమాన్ నికోబర్ దీవులు చివరి స్థానంలో నిలిచాయి.
సుస్థిర అభివృద్ధిలో పెద్ద రాష్ట్రాల విభాగంలో కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచాయి. చిన్న రాష్ట్రాల విభాగంలో మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా మొదటి మూడు స్థానాల్లో నిలవగా, చివరి స్థానంలో మణిపూర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబర్ దీవులు మొదటి స్థానాల్లో నిలవగా, చివరి స్థానాల్లో దాద్రానగర్ హావేలి, ఛండీగఢ్, లక్షద్వీప్ ఉన్నాయి.
మధ్యాహ్నం భోజన పథకం అమలులో చివరిలో తెలుగురాష్ట్రాలు
మధ్యాహ్నం భోజన పథకం అమలులో తెలుగు రాష్ట్రాలు అట్టడుగునా ఉన్నాయి. గోవా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలోనూ, తెలంగాణ 18 స్థానంలో నిలిచాయి. నేషనల్ హెల్త్ స్కీమ్ అమలులో మొదటి మూడు స్థానాల్లో కేరళ, గోవా, తమిళనాడు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలోనూ, తెలంగాణ 7 స్థానంలోనూ నిలిచాయి. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ చివరి స్థానాల్లో నిలిచాయి. ఐసీడీఎస్ అమలులో మొదటి మూడు స్థానాల్లో ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 16 స్థానంలోనూ, తెలంగాణ 18 స్థానంలో నిలిచాయి. సమగ్ర శిక్షా అభియాన్ అమలులో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ మొదటి మూడు స్థానాల్లో నిలిశాయి. చివరి స్థానంలో తెలంగాణ, ఢిల్లీ, హర్యానా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలిచింది.
ఉపాధి హామీ అమలులో కేరళ టాప్
ఉపాధి హామీ అమలులో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు, మూడు స్థానాల్లో నిలిశాయి. తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, గోవా చివరి స్థానాలకు పరిమితం అయ్యాయి.