Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పించుకున్నారన్న పోలీసులు
న్యూఢిల్లీ : శ్రీనగర్‌లోని ఓ ఆస్పత్రిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వీరిని ప్రతిఘటించేందుకు దిగిన భద్రతా దళాలు.. ఎదురు కాల్పులకు దిగాయి. అయితే పౌరులను వినియోగించుకుని ఉగ్రవాదులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఆస్పత్రి వద్దకు భారీగా బలగాలు చేరుకున్నాయి. బెమినాలోని స్కిమ్స్ ఆస్పత్రి వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాలకు కాల్పులు జరిగాయనీ, పౌరులను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పరారయ్యారని శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇది అనుకోకుండా జరిగిన ఎదురుదాడి అనీ, మెడికల్ కాలేజ్, హాస్టల్ వద్ద భారీ బలగాలు మోహరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.